Skip to main content

Namaste NRI

అగ్రరాజ్యంకు డ్రాగన్‌ దేశం గట్టి వార్నింగ్‌

అగ్రరాజ్యం  అమెరికాకు డ్రాగన్‌ దేశం చైనా గట్టి వార్నింగ్‌ ఇచ్చింది. వచ్చే వారంలో అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసి తైవాన్‌ పర్యటనకు రాబోతున్నట్లు తెలిసిందే. ఈ పర్యటనను చైనా ఖండిరచింది.  తైవాన్‌ తమ దేశంలో భాగమేనని చైనా చాలా కాలంగా గొంతు చించుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే అమెరికా మాత్రం తైవాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తూనే ఉంది. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి రaావో లిజియాన్‌ మాట్లాడుతూ చైనా ప్రభుత్వం ఈ పర్యటనను పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు.  అమెరికా ఇదే పద్ధతిలో ప్రవర్తిస్తే, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి చైనా చాలా కఠిన చర్యలు తీసుకోకతప్పదు. ఆ తర్వాత జరిగే పరిణామాలన్నింటికీ అమెరికానే బాధ్యత వహించాల్సి ఉంటుందని అని హెచ్చరించారు.

Social Share Spread Message

Latest News