Skip to main content

Namaste NRI

డ్రోన్‌ కలకలం.. బంకర్‌లోకి రష్యా అధ్యక్షుడు

రష్యా అధ్యక్ష భవన సముదాయం అయిన క్రెమ్లిన్‌పైకి రెండు డ్రోన్‌లు దూసుకురావడంతో ఆ దేశ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా అధ్యక్షుడు పుతిన్‌ను తన నివాసంలోని బంకర్‌లోకి తరలించారు. నోవో – ఒగరెవో ప్రాంతంలోగల తన నివాసంలోని బంకర్‌లో ప్రస్తుతం పుతిన్‌ ఉన్నారు. ప్రస్తుతానికి అధ్యక్షుడు పుతిన్‌ బంకర్‌ నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.   కాగా, రష్యా రాజధాని మాస్కో నగరం నడిబొడ్డున ఉన్న క్రెమ్లిన్ భవనాలపైకి రెండు డ్రోన్‌లు దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. ఈ దాడి యత్నం వెనుక అగ్ర రాజ్యం అమెరికా హస్తం ఉందని రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.

రష్యాలో ఎక్కడెక్కడ దాడి చేయాలనే విషయాలను ఉక్రెయిన్‌కు అమెరికా చెబుతోందని, అమెరికా సూచన మేరకు ఉక్రెయిన్‌ నడుచుకుంటోందని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ ఆరోపించారు. ఉక్రెయిన్‌ తీరు మారకపోతే ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ, అతని బృందాన్ని హతమార్చడం తప్ప తమకు మరో అవకాశం లేదని రష్యా పేర్కొంది. జెలెన్‌ స్కీ లొంగిపోవాల్సిన అవసరం కూడా లేదని, దానికి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుందని వ్యాఖ్యానించింది.

Social Share Spread Message

Latest News