Skip to main content

Namaste NRI

దుమారం మూవీ షూటింగ్ ప్రారంభం

మల్లిక్ బాబు, వినయ్, ఇషా, ప్రియాన్స్ హీరో హీరోయన్లుగా నటిస్తున్న సినిమా దుమారం. ఈ సినిమాలో సుమన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని జీఎల్బీ సినిమా బ్యానర్ పై జీఎల్బీ శ్రీనివాస్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా  సుమన్ మాట్లాడుతూ  జీఎల్బీ శ్రీనివాస్ తో నాకు మంచి స్నేహం ఉంది. ఆయనతో నాకు ఇది మూడో సినిమా. నాయి బ్రాహ్మణుల జీవితాలు, ఈ వృత్తిలో వారు పడుతున్న ఇబ్బందులను ఈ సినిమాలో  చూపిస్తున్నాం. అయితే డాక్యుమెంటరీలా కాకుండూ పూర్తి కమర్షియల్ గా ఉంటుంది. నేను ఇందులో బార్బర్ క్యారెక్టర్ చేస్తున్నాను. మనం అందంగా ఉంటున్నామంటే కారణం వాళ్లే. మంచి ఎంటర్ టైన్ మెంట్, సందేశం అన్నీ కథలో ఉన్నాయి అన్నారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత జీఎల్బీ శ్రీనివాస్ మాట్లాడుతూ నాయి బ్రహ్మణుల జీవితాల నేపథ్యంతో సాగే చిత్రమిది. పూర్తి కమర్షియల్ అంశాలతో సాగుతుంది. ఇవాళ షూటింగ్ లాంఛనంగా ప్రారంభించాం. సోమవారం నుంచి కొమురవెళ్లిలో చిత్రీకరణ కొనసాగిస్తాం. వచ్చే నెల నుంచి కొత్త షెడ్యూల్ ఉంటుంది. హీరో తండ్రి పాత్రలో సుమన్ నటిస్తున్నారు. ఆయనతో నేను చేస్తున్న మూడో చిత్రమిది. అందరినీ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. అన్నారు. ఈ కార్యక్రమంలో  హీరో మల్లిక్ బాబు,  హీరోయిన్ ఇషా,  కో ప్రొడ్యూసర్ తిరుపతి రాజు,  విలన్ పాండు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events