Namaste NRI

ఈగో కా బాప్‌ గుంతలకడి గురునాధం

నితిన్‌ కథానాయకుడిగా శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలు. పొలిటికల్‌ డ్రామాతో మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నది. అంజలి ప్రత్యేక గీతంలో ఆడిపాడారు.  తాజాగా ఈ చిత్రం నుంచి వెన్నెల కిషోర్‌ గుంతలకడి గురునాథం అలియాస్‌ గురు పాత్రలో నటిస్తున్నట్టు తెలిపింది చిత్రబృందం. ఈగో కా బాప్‌ అనే ఉపశీర్షికతో కూడిగిన గురు లుక్‌ని విడుదల చేశారు. జులై 29న థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి  ఎం.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్‌ రెడ్డి, నిఖితారెడ్డి నిర్మాతలు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పకులు. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వరరావు,  సంగీతం: మహతి స్వరసాగర్‌, సినిమాటోగ్రఫీ: ప్రసాద్‌ మూరెళ్ల.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events