Skip to main content

Namaste NRI

ఐదు రాష్ట్రాలకు మోగిన ఎన్నికల నగారా

దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఉత్తరప్రదేశ్‌ సహా ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపుర్‌, గోవా రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటిచింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ (సీఈసీ) సుశీల్‌ చంద్ర మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నామని తెలిపారు. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపూర్‌ శాసనసభల గడువు మార్చితో ముగియనుండగా, ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ గడువు మే నెలతో పూర్తవుతుంది. యూపీలో 403 శాసనసభ నియోజకవర్గాలుండగా ఉత్తరాఖండ్‌లో 70, పంజాబ్‌లో 117, గోవాలో 40, మణిపూర్‌లో 60 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది.  నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది.  మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 10 నుంచి 7 వరకు ఏడు విడతల్లో పోలింగ్‌ జరపనున్నట్లు తెలిపారు. మార్చి 10న కౌటింగ్‌ చేపట్టి ఫలితాలు వెల్లడిరచనున్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News