Skip to main content

Namaste NRI

కళ్యాణ్‌రామ్‌ డెవిల్ కోసం ఎల్నాజ్ నొరౌజీ

నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నుంచి వస్తున్న తాజా చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉప‌శీర్షిక‌. ఈ చిత్రానికి అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన కొత్త న్యూస్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న మూవీ లవర్స్‌ కోసం నయా అప్‌డేట్‌ బయటకు వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మేక‌ర్స్ ఎల్నాజ్ నొరౌజీ  ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ మూవీలో ఎల్నాజ్ నొరౌజీ రోజీ అనే బార్ డాన్స‌ర్ పాత్రలో నటిస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా డెవిల్‌ ముసుగేసుకుని బ్రిటీషర్ల కోసం కళ్యాణ్‌రామ్ ఎందుకు పని చేశాడనే కాన్సెప్ట్‌తో పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. లుక్స్‌ పరంగా కళ్యాణ్‌ రామ్‌ కూడా ఈ సినిమాలో చాలా బాగున్నాడు.  ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన క‌ల్యాణ్‌రామ్, మాళవిక నాయర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లు, నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events