Skip to main content

Namaste NRI

భారత ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

2019లోనే భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్‌ కార్లను తీసుకురావాలని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్‌ మాస్క్‌ భావించారు. ఇప్పటికీ ఆయన కార్యాచరణ వాస్తవ రూపం దాల్చలేదు. భారత ప్రభుత్వంతో చాలా సమస్యలు ఉన్నాయని, ఇప్పటికీ వాటిని పరిష్కరించుకునేందుకు పని చేస్తున్నామని మాస్క్‌ తెలిపారు. భారత్‌  లో టెస్లా కార్‌ లాంచింగ్‌ విషయంలో ఏమైనా అప్‌ డేట్‌ ఉందా? అనే ప్రశ్నకు బదులుగా ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. మోదీ ప్రభుత్వంలోని అధికారులతో గత నాలుగుఏళ్లుగా ఎలాన్‌ మస్క్‌ చర్చలు జరుపుతూనే  ఉన్నారు. అయితే స్థానికంగా ఫ్యాక్టరీని నెలకొల్పాలనే  కండిషనత్‌తో పాటు దిగుమతులపై వంద శాతం సుంకం విధించడంతో మస్క్‌ కల ఇంత వరకు నెరవేరలేదు. కార్ల ఉత్పాదన ప్లాన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలని  కూడా కేంద్రం కండిషన్‌ పెట్టింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఇండియాలో తమ కార్లను అమ్మాలనే మస్క్‌ కోరిక ఇంతవరకు తీరని కోరికగానే మిగిలిపోయింది.

Social Share Spread Message

Latest News