Skip to main content

Namaste NRI

డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడికి ఎప్‌స్టీన్‌ దెబ్బ

లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్న విషయం నిర్ధారణ కావటంతో వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) చీఫ్‌ పదవికి బోర్జ్‌ బ్రెండే రాజీనామా చేశారు. ఎప్‌స్టీన్‌ ఏర్పాటుచేసిన మూడు బిజినెస్‌ డిన్నర్‌లలో బ్రెండే పాల్గొన్నట్టు అమెరికా న్యాయశాఖ వెల్లడించిన కొద్ది గంటల్లోనే బ్రెండే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో ఆయనకు గల సంబంధాలపై డబ్ల్యూఈఎఫ్‌ కొన్ని వారాల క్రితమే స్వతంత్ర దర్యాప్తు చేపట్టింది. ఎప్‌స్టీన్‌తో బ్రెండే సంబంధాలు కలిగి ఉన్నాడని తెలిపే ఈమెయిల్‌, టెక్ట్స్‌ సందేశాలు బయటపడ్డాయి.

Social Share Spread Message

Latest News