Namaste NRI

ఈషా రెబ్బా తమిళ సినిమా షురూ 

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది ఈషా రెబ్బా. ఈ వ‌రంగ‌ల్ చిన్నది ఓ వైపు లీడ్ రోల్స్‌, మరోవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఒట్టు సినిమాతో గతేడాది మాలీవుడ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది ఈషారెబ్బా.  ఈ బ్యూటీ తాజాగా తమిళంలో నటిస్తున్న కొత్త సినిమా అప్‌డేట్ అందించింది. రమేశ్ రవిచంద్రన్‌ డైరెక్ట్.   ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తున్నాడు.   ఈషా రెబ్బా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం చెన్నైలోని కాళికాంబల్‌ టెంపుల్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛ్ అయింది. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి రసమతి సినిమాటోగ్రాఫర్‌. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ షురూ కానుంది. హీరోహీరోయిన్లతోపాటు టెక్నికల్ టీం, ఇతర సిబ్బంది లాంఛింగ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events