Skip to main content

Namaste NRI

ఈయూ కీలక నిర్ణయం.. స్వాగతించిన ఉక్రెయిన్‌

ఉక్రెయిన్‌పై యుద్దానికి దిగిన రష్యా ఆర్థిక వనరులను దెబ్బకొట్టడమే లక్ష్యంగా యూరోపియన్‌ యూనియన్‌ కీలక నిర్ణయం తీసుకున్నది. రష్యా ఆయిల్‌ దిగుమతుల్లో అధిక భాగాన్ని నిషేధించేందుకు అంగీకారం తెలిపింది. ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతుల్లో దాదాపు 90 శాతం తగ్గించేందుకు ఈయూ నేతలు అంగీకరించారు. చమురు దిగుమతులపై చర్చల సమయంలో ఈయూ నేతల మధ్య భిన్నభిప్రాయాలు వ్యక్తమయ్యాయనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామా చోటు చేసుకోవడం గమనార్హం. రష్యా ఆయిల్‌ దిగుమతులను బ్లాక్‌ చేయడాన్ని ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా స్వాగతించారు. ఈయూ నిర్ణయంపై రష్యా అధికారి మిఖాయిల్‌ ఉలియానోవ్‌ స్సందిస్తూ దీని వలన నష్టం ఉన్నప్పటికీ, తాము ఇతర దిగుమతిదారులను చూసుకుంటామని అన్నారు.

Social Share Spread Message

Latest News