Skip to main content

Namaste NRI

శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టు కు ప్రవాస భారతీయుడు భారీ విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రవాస భారతీయుడు భారీ విరాళం అందించారు. అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్న రవి ఐకా తరపున వారి ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్‌ ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.4.20 కోట్ల భారీ విరాళం అందించారు. ఈ మేరకు చెక్కును తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ధర్మరెడ్డి మాట్లాడుతూ రవి ఐకా ఇప్పటికే టీటీడీకి చెందిన పలు ట్రస్టులకు దాదాపు రూ.40 కోట్లు విరాళం అందించారని తెలిపారు.  ఎస్వీబీసీలో కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు కోసం రూ.7 కోట్లు విరాళంగా అందించేందుకు మందుకు వచ్చారని తెలిపారు. తొలివిడతగా రూ.4.20 కోట్లు అందజేశారని తెలిపారు. ఈ మొత్తంతో ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్‌ ఆర్ట్‌ కెమెరాలు ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈవో సురేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News