Skip to main content

Namaste NRI

ఎఫ్‌ 3 విజయోత్సవ వేడుక

ప్రముఖ కథానాయకుడు వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌తో కలిసి నటించిన చిత్రం ఎఫ్‌3. తమన్నా, మెహరీన్‌, సోనాల్‌ చౌహాన్‌ నాయికలుగా నటించారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు, శిరీష్‌ నిర్మాతలు. చిత్ర బృందం హైదరాబాద్‌లో విజయోత్సవాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ ఈ సినిమా చిత్రీకరణ జరిగిన 100 రోజుల్లోనూ సెట్లో ఆహ్లాదరకమైన వాతావరణం కనిపించేంది. ప్రతి ఒక్కరూ సొంత సినిమాగా భావించి పని చేశారు. నిజమైన సమిష్టి కృషి అంటే ఏమిటో చాటి చెప్పింది మా బృందం. అందుకే ఇంత పెద్ద విజయం సాధ్యమైందన్నారు. వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ పిల్లలు కూడా ఈ సినిమా చూస్తూ డ్యాన్సులు చేస్తున్నారు. ఇలాంటి సినిమా తీసి ఫ్రస్ట్రేషన్‌ లేకుండా చేశారు దర్శకుడు. మా ఎఫ్‌ 3 కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ  పాండమిక్‌ తర్వాత చిర్రత పరిశ్రమ కళ కోల్పోయింది. మళ్లీ ఇండస్ట్రీ పుంజుకోవాలంటే ప్రతి వారం విడుదలయ్యే సినిమా ఆదరణ పొందాలి. ఒక్కొక్కటిగా ప్రతి సినిమా ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు తీసుకొస్తున్నది.వాటిలో మా సినిమా కూడా నిలిచినందుకు సంతోషంగా ఉంది అన్నారు.  అన్నపూర్ణమ్మ, వై.విజయ, శిరీష్‌, అలీ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ప్రదీప్‌, ప్రగతి, శ్రీనివాసరెడ్డి, జెమినీ సురేష్‌, స్టంట్‌ శివ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events