Skip to main content

Namaste NRI

శరవేగంగా ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు

 సొహైల్‌, మృణాళినీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ఆర్గానిక్‌ మామా, హైబ్రీడ్‌ అల్లుడు. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్‌ సందేశ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ హైదరాబాద్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భగా అచ్చిరెడ్డి మాట్లాడుతూ  చిత్ర యూనిట్‌ సమక్షంలో ఎస్‌వి. కృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు జరగం ఆనందంగా వుంది. ప్రతి ఏడాది వచ్చేది. ఆత్మీయుల సమక్షంలో జరుపుకోవడంలో ఆనందం వేరుగా ఉంటుంది. సోహైల్‌ హీరోగా బాగా చేస్తున్నాడు. మృణాళిని రవి మంచి నటి. చాలా నాచురల్‌గా చేస్తుంది. తెలుగులో సుస్థిర స్థానం సంపాదించుకుంటుందనే నమ్మకముంది అన్నారు. అనంతరం  ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ  నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా కథా చర్చల్లో రెండున్నర గంటల పాటు నవ్వుకున్నాం. ఇవే నవ్వులు రేపు థియేటర్‌లో పూస్తే సినిమా ఘన విజయం సాధించినట్లే. గతంలో ఎంత కష్టపడి సినిమాలు రూపొందించానో ఇప్పటికీ అదే అంకితభావంతో తెరకెక్కిస్తున్నాం అన్నారు. అమ్ము క్రియేషన్స్‌ సమర్పణలో కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో నిర్మాత కోనేరు కల్పన, అచ్చిరెడ్డి, సోహైల్‌, మృణాలినీ, కృష్ణభగవాన్‌, ఛాయాగ్రహకుడు రామ్‌ ప్రసాద్‌  తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events