Skip to main content

Namaste NRI

అమెరికాలో ఘోర ప్రమాదం

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్నది. వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో ఓ ప్రయాణికుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 67 మంది ప్రయాణికుల ఆచూకీ గల్లంతయ్యింది. కాన్సాస్లోని విచిట నుంచి బయలుదేరిన అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ప్రాంతీయ విమానం రీగన్ నేషనల్ ఎయిర్పోర్టులోని రన్వే 33పై ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రన్వేకు అతి సమీపంలో, పోటోమాక్ నదిపైన ఎదురుగా ఆర్మీ శిక్షణ హెలికాప్టర్ రావడంతో రెండూ ఢీకొన్నాయి. ప్రమాదంలో విమానం, హెలికాప్టర్ ముక్కలయ్యి పోటోమాక్ నదిలో కూలిపోయాయి.
హెలికాప్టర్ సైతం తలకిందులుగా నేలకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. హెలికాప్టర్లో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు సైన్యం ధ్రువీకరించింది. వీరందరూ మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు 27 మంది మృతదేహాలను వెలికితీసినట్టు తెలుస్తున్నది. మృతుల్లో అమెరికా, రష్యాకు చెందిన ఫిగర్ స్కేటింగ్ క్రీడాకారులు ఉన్నారు.

Social Share Spread Message

Latest News