అమెరికా రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. ఎఫ్`1 విద్యార్థి వీసా తిరస్కరణకు గురైన వారికి రానున్న దరఖాస్తులో మరోసారి స్లాట్ ఇవ్వడం కుదరని అమెరికా రాయబార కార్యాలయ మినిస్టర్ కౌన్సిలర్ డొనాల్డ్ ఎల్ హెఫ్లెన్ స్పష్టం చేశారు. విద్యార్థి వీసాలకు ఈ ఏడాది జూన్‌తో పాటు జూలై ప్రథమార్ధంలో దరఖాస్తుల్ని స్వీకరిస్తాం. అయితే కేవలం తొలిసారి దరఖాస్తు చేస్తున్న వారికి మాత్రమే ఈసారి స్లాట్ కేటాయించాలని భావిస్తున్నాం అని అన్నారు. ఢల్లీిలోని రాయబార కార్యాలయ వెబ్‌పేజీలో నిర్వహించిన 45 నిముషాల లైవ్ చాట్‌లో ఆయన ఆ మేరకు వెల్లడిరచారు.














