Namaste NRI

చరిత్ర సృష్టించిన ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌ సంస్థ

అమెరికాకు చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆ సంస్థ ప్రయోగించిన బ్లూ ఘోస్ట్‌ ల్యాండర్‌ సుదీర్ఘ ప్రయాణం తర్వాత చంద్రుని ఉపరితలంపై విజయవంతంగా కాలుమోపింది. టెక్సాస్‌లోని ఫైర్‌ఫ్లై మిషన్‌ కంట్రోల్‌ విభాగం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో చంద్రుని ఉపరితలంపై సరైన స్థితిలో వ్యోమనౌకను దించిన తొలి ప్రైవేట్‌ సంస్థగా ఫైర్‌ఫ్లై రికార్డులకెక్కింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ఆధ్వర్యంలోని స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఫాల్కన్‌-9 రాకెట్‌ జనవరి 15న ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి బ్లూ ఘోస్ట్‌ తోపాటు జపాన్‌లోని ఐస్పేస్‌  సంస్థకు చెందిన మరో ల్యాండర్‌ హకుటో ఆర్‌-2 ను నింగిలోకి తీసుకెళ్లింది.6 అడుగుల (2 మీటర్ల) పొడవు, 11 అడుగుల (3.5 మీటర్ల) వెడల్పుతో పసిడి వర్ణంలో బ్లూ ఘోస్ట్‌ చంద్రుని కక్ష్య నుంచి ఆటోపైలట్‌ పద్ధతిలో కిందికి ప్రయాణించి ఈశాన్య అంచున ఉన్న మోన్స్‌ లాట్రెయిల్లే సమీపంలో దిగింది.

Social Share Spread Message

Latest News