Skip to main content

Namaste NRI

రంగబలి నుంచి ఫస్ట్‌ సాంగ్‌ లాంఛ్

నాగశౌర్య హీరో గా  నటిస్తున్న చిత్రం  రంగబలి . ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తోంది.   విలేజ్ నేపథ్యంలో సాగే ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్‌ పవన్‌ బసంశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు తెరకెక్కించే ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ సాంగ్‌ మన ఊరిలో ఎవడ్రా ఆపేది సాంగ్‌ను మేకర్స్ లాంఛ్ చేశారు. పవన్‌ బసంశెట్టి, శ్రీ హర్ష ఎమని రాసిన ఈ పాట పవన్ సీహెచ్‌ ఎనర్జిటిక్‌ బీట్స్‌ తో సాగుతూ మ్యూజిక్ లవర్స్‌ లో జోష్‌ నింపుతోంది. జానీ మాస్టర్ మెస్మరైజింగ్ కొరియోగ్రఫీ పాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువబోతున్నట్టు విజువల్స్‌తో అర్థమవుతోంది. ప్రస్తుతం రంగబలి షూటింగ్‌ చివరి దశలో ఉంది. నాగశౌర్య నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి విడుదలవగా.. ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సత్య, చాఓ, అనంత్‌ శ్రీరామ్‌, గోపరాజు రమణ, కల్యాణి నటరాజన్‌, శుభలేక సుధాకర్‌, మురళీ శర్మ, సప్తిగిరి, రాజ్‌ కుమార్‌ కసిరెడ్డి, భద్రం, శివనారాయణ, పీకే, పవన్, నోయెల్‌, రమేశ్ రెడ్డి, హరీష్‌ చంద్ర, బ్రహ్మాస్త్రి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  జులై 7న గ్రాండ్‌గా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News