Skip to main content

Namaste NRI

భారత్‌తో సంబంధాలకు.. ఆ దేశం తహతహ

యాదాది దేశం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు అల్లాడుతున్నది. ప్రస్తుతం భారత్‌తో సంబంధాలను పునరుద్ధరించాలని ఆ దేశానికి చెందిన వ్యాపారవేత్తలను ప్రభుత్వానికి సూచించారు. ఈ క్రమంలో ఆ దేశం క్రమంగా భారత్‌పై తన వైఖరిని మార్చుకుంటూ వస్తున్నట్లుగా కనిపిస్తున్నది. గతంలో భారత్‌ అంటేనే కుతకుతలాడే ఆ దేశం,  ప్రస్తుతం సత్సంబంధాలకు రెడీ అంటూ సంకేతాలను ఇస్తున్నది. భారత్‌తో తాము శాశ్వత శత్రుత్వాన్ని కోరుకోవడం లేదని,  కొత్త ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తుందని ఆ దేశ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఇస్లామాబాద్‌తో సంబంధాల పునరుద్ధరణ విషయంలో భారత్ హుందాగా వ్యవహరిస్తుందని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ ఇస్లామాబాద్‌ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పొరుగుదేశాలతో తాము మంచి సంబంధాలను కోరుకుంటామన్నారు. తూర్పున ఉన్న భారత్‌తో సంబంధాలు చారిత్రక సమస్యగా మారాయని, అయితే, పాక్‌ శాశ్వత శత్రుత్వాన్ని ఎన్నడూ విశ్వసించదన్నారు. పరస్పర గౌరవం, సార్వభౌమ సమానత్వం, జమ్మూకశ్మీర్‌పై దీర్ఘకాలంగా ఉన్న వివాదానికి న్యాయమైన, శాంతియుత పరిష్కారం ఆధారంగా భారత్‌తో మంచి సంబంధాలు కోరుకుంటున్నామన్నారు. నిర్మాణాత్మక చర్చలను పాకిస్థాన్ కోరుకుంటోందని, అంతమాత్రాన ఏకపక్ష, భారత్ ఆధిపత్య విధానాలను మాత్రం పాక్‌ అంగీకరించబోదన్నారు.

Social Share Spread Message

Latest News