జపాన్‌కు చెందిన 13 ఏళ్ల మొమిజి నిషియా చరిత్ర సృష్టించింది. మహిళల స్ట్రీట్ స్కేట్‌బోర్డింగ్ ఈవెంట్‌లో ఆ అమ్మాయి గోల్డ్ మెడల్ గెలిచింది. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి స్కేట్ బోర్డింగ్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఈవెంట్‌లో బ్రెజిల్‌కు చెందిన రైసా లీల్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నది. ఆ అమ్మాయి వయసు కూడా 13 ఏళ్లే. ఇక ఈ గేమ్‌లో బ్రాంజ్ మెడల్‌ను జపాన్ ప్లేయర్ పునా నకయామా గెలుపొందింది. నిషియా వయసు 13 ఏళ్ల 330 రోజులు. అయితే గతంలో ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన అత్యంత పిన్న వయసున్న అథ్లెట్‌గా మర్జోరి గెస్ట్రింగ్ నిలించింది. 1936లో జరిగిన బెర్లిన్ గేమ్స్‌లో స్ప్రింగ్ బోర్డ్ టైటిల్‌ను ఆమె గెలిచింది. 13 ఏళ్ల 267 రోజుల వయసులో ఆమె ఆ టైటిల్ చేజిక్కించుకున్నది.