అమెరికాలో సిర్థపడాలని శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయా రాజపక్స నిర్ణయించుకున్నారు. అమెరికా గ్రీన్‌కార్డు కోసం ఆయన ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి గొటబయా అర్హుడే. ఎందుకంటే ఆయన భార్య రోమాకు అమెరికా పౌరసత్వం ఉంది. భార్య, కుమారుడితో కలిసి అమెరికాలో స్థిరపడాలని గొటబయా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఓ హోటల్‌లో భార్యతో కలిసి ఉంటున్నారు. ఈ ఏడాది నవంబర్ వరకూ థాయ్‌లాండ్‌లోనే ఉండి పోవాలని తొలుత అనుకున్నప్పటికీ స్వదేశానికి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ నెల 25న శ్రీలంకకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.














