Skip to main content

Namaste NRI

శ్యామ్ సింగరాయ్ నుంచి.. ఏదో ఏదో తెలియని లోకమా

నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్‌సింగరాయ్‌.  ఈ చిత్రంలోని రెండో లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. ఏదో ఏదో తెలియని లోకమా అనే పల్లవితో సాగే ఈ గీతాన్ని కృష్ణకాంత్‌ రచించగా, చైత్ర అంబడిపుడి ఆలపించారు. మిక్కీ జే మేయర్‌ స్వరకర్త. ఇందులో నాని, కృతిశెట్టి మధ్య రొమాన్స్‌ ఆకట్టుకునేలా సాగింది. ఈ చిత్రంలో బెంగాలీ యువకుడు శ్యామ్‌ సింగరాయ్‌గా నాని కనిపించనున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌, మురళీశర్మ, అభినవ్‌గోమటం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాను జాన్‌ వర్గీస్‌, సంగీతం: మిక్కీ జే మేయర్‌, కథ: సత్యదేవ్‌ జంగా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత : ఎస్‌.ఎంకటరత్నం, దర్శకత్వం : రాహుల్‌ సంకృత్యాన్‌. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకుడు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియణ్‌ కథానాయికలు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, డిసెంబర్‌ 24న విడుదల చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు.   

Social Share Spread Message

Latest News