Skip to main content

Namaste NRI

సెన్సార్ పూర్తి చేసుకున్న గాండీవ‌ధారి అర్జున

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం గాండీవధారి అర్జున.వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఎ. సర్టిఫికెట్‌ లభించింది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ట్రైలర్‌, పాటలకు అద్భుతమైన స్పందన లభించింది.  గూఢచారి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇందులో వరుణ్‌తేజ్‌ ైస్టెలిష్‌గా కనిపిస్తారు. యాక్షన్‌ ఘట్టాలు రోమాంచితంగా ఉంటాయి. కథలో అంతర్లీనంగా మంచి సందేశం ఉంటుంది అని పేర్కొన్నారు.  నాజ‌ర్‌, విమ‌లా రామ‌న్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ సినిమాకు ముఖేష్ సినిమాటోగ్రాప‌ర్‌గా అవినాస్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా గాండీవధారి అర్జున  ఆగస్ట్ 25న భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events