Namaste NRI

చిరంజీవి అభిమానులకు శుభవార్త..సంక్రాంతికి సై

చిరంజీవి అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న 154వ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండక్కి ఈ సినిమా థియేటర్‌లలో సందడి చేయబోతున్నది. రిలీజ్‌ డేట్‌ ప్రకటన సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో సంక్రాంతికి కలుద్దాం అంటూ చిత్ర బృందం పేర్కొన్నారు. పోర్ట్‌ ఏరియా బ్యాక్‌ డ్రాప్‌తో మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెకుతోంది. ప్రస్తుతం 40 శాతం షూటింగ్‌ పూర్తి చేశారు. త్వరలో కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణకు టీమ్‌ సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో శృతిహాసన్‌ నాయికగా నటిస్తున్నది. త్వరలో సినిమా టైటిల్‌, టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణంలో దర్శకుడు బాబీ ( కేఎస్‌ రవీంద్ర) ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ నిర్మాతలు. జీకే మోహన్‌ సహ నిర్మాత: ఈ చిత్రానికి స్కీన్‌ప్లే: కోన వెంకట్‌, కె.చక్రవర్తి రెడ్డి, ఎడిటర్‌: నిరంజన్‌ దేవరమానే, సినిమాటోగ్రఫీ: ఆర్థర్‌ ఏ విల్సన్‌, సంగీతం: దేవీశ్రీప్రసాద్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events