Skip to main content

Namaste NRI

భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్

భారతీయ పర్యాటకులకు గుడ్‌న్యూస్ ప్రపంచంలోనే అత్యంత ఎత్త‌యిన‌ భవనం బుర్జ్ ఖ‌లీఫాను సందర్శించేందుకు ఇప్పుడు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా ఆన్‌లైన్‌లోనే టికెట్లు బుక్ చేసుకోవచ్చ‌ని యూఏఈలో ఈ-కామర్స్ లావాదేవీల కోసం యూపీఐ చెల్లింపులను స్వీకరిస్తున్న తొలి సంస్థగా బుర్జ్ ఖలీఫా నిలిచింది. ఈ సేవలను ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, నియోపే, ఈమార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ప్రారంభించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ కొత్త సదుపాయంతో భారత పర్యాటకులు యూఏఈకి ప్రయాణానికి ముందే బుర్జ్ ఖలీఫా అధికారిక వెబ్‌సైట్ నుంచి తమకు నచ్చిన యూపీఐ యాప్‌తో సులభంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చు. యూఏఈలో 2022 లోనే క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాయి. నియోపే నెట్‌వర్క్‌లోని వ్యాపార సంస్థల వద్ద భారత పర్యాటకులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సేవలను ఆన్‌లైన్ బుకింగ్స్‌కు కూడా విస్తరించారు.ఈ సందర్భంగా ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ ఎండీ, సీఈవో రితేశ్‌ శుక్లా మాట్లాడుతూ విదేశాలకు వెళ్లినప్పుడు భారత పర్యాటకులు సులభమైన, సుపరిచితమైన చెల్లింపు అనుభవాన్ని కోరుకుంటున్నారు. ఈ సదుపాయంతో వారు యూఏఈకి రాకముందే తమకు అలవాటైన యూపీఐతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు.

Social Share Spread Message

Latest News