Skip to main content

Namaste NRI

సినిమా ప్రియులకు శుభవార్త… ఈ నెల 23 నుంచి థియేటర్లు

సినిమా ప్రియులకు శుభవార్త. గత కొద్ది నెలల నుంచి మూతబడ్డ సినిమా థియేటర్లు త్వరలోనే తెరుచుకోనున్నాయి. ఈ నెల 23వ తేదీ నుంచి సినిమా థియేటర్లను తెరవాలని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రెసిడెంట్‌ మురళీమోహన్‌, సెక్రటరీ సునీల్‌ నారంగ్‌.. ఎగ్జిబిటర్లతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి థియేటర్ల ఓపెన్‌పై నిర్ణయం తీసుకున్నారు. సినిమా థియేటర్లలో పని చేసే సిబ్బంది ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్నామని ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు తెలిపారు.

ఈ భేటీ కంటే ముందు సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రతినిధులు సమావేశం అయ్యారు. మంత్రిని కలిసిన వారిలో సునీల్‌ నారంగ్‌, అనుపమ్‌ రెడ్డి, కిశోర్‌ బాబు, అభిషేక్‌ నామా, బాల గోవిందరాజు సమావేశం అయ్యారు. థియేటర్లకు ప్రకటించిన రాయితీలపై ఉత్తర్వులు జారీ చేయాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు.

Social Share Spread Message

Latest News