Namaste NRI

సౌదీ అరేబియా శుభవార్త … మరో ఆరు దేశాలకు

ఇ-వీసా యాక్సెస్ విషయంలో సౌదీ అరేబియా శుభవార్త చెప్పింది. మరో ఆరు దేశాలకు ఈ సౌకర్యాన్ని విస్తరిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఇక కొత్తగా ఇ-వీసా యాక్సెస్ పొందిన దేశాల జాబితాలో తుర్కియే, థాయ్‌లాండ్, పనామా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సీషెల్స్, మారిషస్ ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే టూరిస్టులు ఇప్పుడు ఉమ్రాకు పరిమితమైన విశ్రాంతి, వ్యాపారం, మతపరమైన ప్రయాణాల వంటి ప్రయోజనాల కోసం ఇ-వీసాల  ను పొందవచ్చని పర్యాటక మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ విస్తరణతో సౌదీ అరేబియా ద్వారా విజిటర్ ఇ-వీసాలు పొందుతున్న దేశాల సంఖ్య 63కి చేరిందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events