Skip to main content

Namaste NRI

సింగపూర్ శుభవార్త… భారత్ సహా ఆరు దేశాల ప్రయాణికులకు

కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భారత్‌ సహా ఆరు దక్షిణాసియా దేశాలను తన ప్రయాణ ఆంక్షల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు సింగపూర్‌ ప్రకటించింది. బంగ్లాదేశ్‌, మయన్మార్‌, నేపాల్‌, పాకిస్థాన్‌, శ్రీలంక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ ఆరు దేశాల్లో 14 రోజుల ట్రావెల్‌ హిస్టరీ ఉన్నవారు ఈ నెల 27 నుంచి సింగపూర్‌ వచ్చేందుకు, లేదా సింగపూర్‌ మీదుగా రాకపోకలు సాగించేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే వచ్చేవారు మొదటి 10 రోజులు ఇళ్లలోనే  ఉండాల్సి వస్తుందని పేర్కొంది. ఈ ఆరు దేశాల్లో కొవిడ్‌ పరిస్థితులు కొన్నాళ్లుగా స్థిరంగా సాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రి ఓంగ్‌ యే కుంగ్‌ తెలిపారు. దీంతో పాటు పొరుగు దేశాలైన మలేషియా, ఇండోనేషియా నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠిన నిబంధనలు సడలించినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఆంక్షలను మరింత సడలించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Social Share Spread Message

Latest News