Skip to main content

Namaste NRI

గోపీచంద్ రామబాణం సెకండ్ సింగిల్   

గోపీచంద్ హీరోగా  దర్శకుడు శ్రీవాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం రామబాణం.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటని ఏప్రిల్ 14న కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోపిచంద్, డింపుల్ హయాతీ పండగ వాతావణంలో సంప్రదాయ దుస్తులలో గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. ఈ మూవీలో జగపతి బాబు, ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్. జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న రామబాణం గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events