హరియాణా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయ ఢల్లీిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధాన మంత్రి ముందుగా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరియాణా రాష్ట్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. హరియాణా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, రైతు సంక్షేమం పట్ల ప్రధాన మంత్రి ప్రత్యేక శ్రద్ధ కనబర్చారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రధాని అభిలషించారు. ప్రధాన మంత్రితో భేటీ తనకి మరింత స్ఫూర్తినిచ్చిందని గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు.