Skip to main content

Namaste NRI

నట కిరీటి పద్మశ్రీ రాజేంద్రప్రసాద్ కు ఫిలడెల్ఫియా లో ఘన సన్మానం

నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్రప్రసాద్ కు అమెరికాలోని ఫిలడెల్ఫియాలో తెలుగు కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆగస్టు 9న పెన్సిల్వేనియాలోని చెస్టర్ స్ప్రింగ్స్
‘బేయర్ స్టేషన్ క్లబ్ హౌస్’ లో రవి పొట్లూరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలుగు వారు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్ విలక్షణమైన నటనతో సినీ పరిశ్రమలో దాదాపు 49 సంవత్సరాలలో కోట్లాది మంది అభిమానులును సంపాదించుకున్నారు అని అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు, అభిమానులు కొనియాడారు. హాస్య చిత్రాలతో పాటు, ఎన్నో ఉత్తమ పాత్రలతో అలరిస్తున్న రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు తో సత్కరించడం తెలుగు జాతికి, తెలుగు సినిమాకు గర్వకారణం అన్నారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్ కు రూ. 8 లక్షలు విరాళంగా అందజేశారు, అనంతరం శాలువతో జ్ఞాపికతో ఘనంగా రాజేంద్రప్రసాద్ ను సన్మానించారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రవాస తెలుగు ప్రజలు తనపై చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమానుభవం రాగాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సముద్రాలు దాటి వచ్చినా తెలుగు ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమానురాగాలు చూస్తుంటే కన్నతల్లి ఒడిలో ఉన్నట్టుందని , మీ ప్రేమే నన్ను ఇన్ని ఏళ్లు నటుడు గా ముందుకు నడిపిస్తున్నదని పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం తనకు లభించిన సత్కారం మాత్రమే కాదని తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకుల అందరికీ చెందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమానికి శ్వేతా కోమోజీ వ్యాఖ్యాత గా వ్యవహరించగా జగదీప్ రెడ్డి అనుముల, పరమేష్ భీమ్ రెడ్డి, వేణు సంఘానికి, సతీష్ తుమ్మల,రామకృష్ణ తాడిశెట్టి ,గిరిధర్ మాసిరెడ్డి, వేణు కోమటిరెడ్డి, రాజు కక్కెర, ఫని కంతేటి, సునీల్ కోగంటి, వెంకట్ సింగ్, సురేష్ వెంకన్న గారి తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events