తేజ్ కూరపాటి, అఖిల ఆకర్షణ జంటగా నటిస్తున్న సినిమా నా వెంటపడుతున్న చిన్నాడెవడమ్మా. దర్శకుడు వెంకట్ వందెలా మాట్లాడుతూ పురాణాల్లో మనం పవిత్రప్రేమ ఎలా ఉంటుందో చదువుకున్నాం. అలాంటి పవిత్రప్రేమ కథ ఇది. మామూలు ప్రేమ కథల్లా అమ్మాయి, అబ్బాయి ఒకరి వెంట మరొకరు పడటం ఉండదు. ఒక అబ్బాయి తన ప్రేమ గురించి చెప్పుకునే సినిమా అన్నారు. కమలాక్షి మాట్లాడుతూ నన్ను నిర్మాతగా పరిచయం చేసిన మా తల్లితండ్రులు ముల్లేటి నాగేశ్వరావు, జానకిగార్లకు ధన్యవాదాలు అన్నారు. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్ర ఇది అన్నారు తేజ్ కూరపాటి. జీవీఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో మల్లేటి నాగేశ్వరావు నిర్మాణ సారథ్యంలో ముల్లేటి కమాలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. వెంకట్ వందెల దర్శకుడు. ఈ నెల 19న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో సముద్ర, వడ్లపట్ల మోహన్, తేజ్, అఖిల, సందీప్, పద్మిని తదితరులు పాల్గొన్నారు.














