బాలీవుడ్ తారా శిల్పా శెట్టి వెబ్‌సిరీస్‌లో నటిస్తుంది. ఈ వెబ్ సిరిస్‌ను దర్శకుడు రోహిత్ శెట్టి రూపొందిస్తున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రా మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇండియన్ పోలీస్ ఫోర్స్ పేరుతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాక్షన్ ఎంటర్టైనర్ను ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించడానికి ఇష్టపడతా. ఈసారి కూడా ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తానని నమ్ముతున్నా అని అన్నారు. ఓటీటీ వేదిక మీదకు రావడం థ్రిల్లింగ్‌గా ఉంది. పవర్‌పుల్ పోలీస్‌గా ఆకట్టుకుంటా అని శిల్పా శెట్టి పేర్కొంది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది వెబ్ సిరీస్.














