Skip to main content

Namaste NRI

త్వరలోనే హెచ్‌-1బీ రద్దు బిల్లు!

అమెరికాలో ప్రతిభావంతులు లేరని, విదేశీ నిపుణుల అవసరం ఉన్నందున హెచ్‌-1బీ వీసా కార్యక్రమం అనివార్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన కొన్ని రోజులకే హెచ్‌-1బీ వీసాకు ముగింపు పలికేందుకు త్వరలోనే ఓ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు అమెరికా కాంగ్రెస్‌ రిపబ్లికన్‌ సభ్యురాలు మార్జోరీ టేలర్‌ గ్రీనే వెల్లడించారు. హెచ్‌-1బీ వీసా ప్రోగ్రామ్‌ని తొలగించి విదేశీ ఉద్యోగుల స్థానంలో అమెరికన్లను భర్తీ చేయడానికి తాను ఈ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు ఆమె తెలిపారు.

ఈ తాత్కాలిక వర్క్‌ వీసా ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్న భారతీయులు హెచ్‌-1బీ కార్యక్రమంపై వేటు పడితే అధికంగా నష్టపోయే అవకాశముంది. గ్రీన్‌ కార్డు మార్గం ద్వారా అమెరికా పౌరసత్వాన్ని పొందేందుకు హెచ్‌-1బీ సులువైన మార్గంగా ఉపయోగపడుతోంది. అమెరికన్‌ ఉద్యోగులకు ప్రయోజనాలు దక్కకుండా చేసేందుకు అమెరికా సంస్థలు హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌ని దుర్వినియోగం చేస్తున్నాయని కూడా గ్రీనే ఆరోపించారు. మన సొంత మనుషులనే పక్కనపెట్టేందుకు హెచ్‌-1బీ ప్రోగ్రామ్‌ని టెక్‌, ఏఐ దిగ్గజాలు, దవాఖానలు, పరిశ్రమలు దుర్వినియోగం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులు అమెరికన్లని, అమెరికన్ల పట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని ఆమె తెలిపారు

Social Share Spread Message

Latest News