పాలస్తీనా పౌరుల స్వేచ్ఛా, స్వాతంత్ర్యానికి బాసటగా నిలిచిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పాలస్తీనియన్ల హక్కులకు ఉగ్ర సంస్ధ హమాస్ ప్రాతినిధ్యం వహించదని స్పష్టం చేశారు. ఇజ్రాయెలీలు, పాలస్తీనియన్లు సమానస్దాయిలో భద్రత, శ్రేయస్సు ఉండాలని ఆకాంక్షించారు. గౌరవంతో స్వేచ్ఛగా జీవనం సాగించేందుకు పాలస్తీనా ప్రజల హక్కుకు తాను మద్దతిస్తానని, వారి ఆకాంక్షలకు హమాస్ అద్దం పట్టదని పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలను అమెరికా తీవ్రంగా ఖండిస్తుందని అంతకుముందు ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాద చర్యలను సమర్ధించుకోలేరని ఆమె వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులను ప్రస్తావిస్తూ ఇజ్రాయెల్‌లో జరిగిన దానిపై తాను తీవ్రంగా కలత చెందానని, ఉగ్రవాద చర్యలను అమెరికా తీవ్రంగా ఖండిస్తుందని, ఉగ్రవాదం ఏ రకంగానూ సమర్దనీయం కాదని కమలా హ్యారిస్ స్పష్టం చేశారు.














