Namaste NRI

విజయదశమి సందర్భంగా హలో జాను షురూ

మనోజ్‌ గోపాల్‌ కృష్ణ, శ్రీ ఇందు జంటగా నటిస్తున్న చిత్రం హలో జాను. మంజుల సరోజు దర్శకురాలు. ఎస్‌.ఎమ్‌ క్రియేషన్స్‌, సుముధ క్రియేషన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ  సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా దర్శకురాలు మంజుల సరోజు మాట్లాడుతూ నేటి నుంచి రెగ్యులర్‌  చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఒకే షెడ్యూల్‌లో షూట్‌ పూర్తి చేయనున్నాం. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబు చేస్తున్నాం. సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇందులో మరో ప్రముఖ నాయిక కూడా కీలక పాత్ర పోషించనుంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తాం అన్నారు. పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో హీరోగా, మారాను. మంజుల సరోజ నాకు మంచి అవకాశమిచ్చారు. ఈ చిత్రం అందరినీ అలరిస్తుందని నమ్మకంగా ఉందన్నారు హీరో మనోజ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events