ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈడీ కేసులను తొలుత విచారణ జరపాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విజయసాయిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మొదట సీబీఐ కేసులు, లేదంటే సీబీఐ, ఈడీ రెండు కేసులూ సమాంతరంగా విచారించేలా ఆదేశాలివ్వాలని కోరారు. హైకోర్టు సైతం విజయసాయిరెడ్డి వాదనలను తోసిపుచ్చుతూ సీబీఐ కోర్టు నిర్ణయాన్నే సమర్థించింది. మరో వైపు ఇదే అంశంపై జగతి పబ్లికేషన్స్, రఘురాం సిమెంట్ దాఖలు చేసిన పిటిషన్లనూ ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.