Skip to main content

Namaste NRI

మోదీకి అత్యున్నత పురస్కారం

ప్రధాని మోదీకి గార్డియన్‌ ఆఫ్‌ ది బ్లూ హారిజన్‌ గౌరవ బిరుదును సీషెల్స్‌ అందించింది. పర్యావరణ పరిరక్షణలో, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో చూపుతున్న నిబద్ధతకు గాను దీన్ని ప్రదానం చేసింది. విదేశాల నుంచి మోదీకి లభించిన అంతర్జాతీయ గౌరవాల్లో ఇది 34వది. సీషెల్స్‌ అధ్యక్షుడు పాట్రిక్‌ హెర్మిని ఈ బిరుదును మోదీకి ప్రదానం చేశారు. తనకు ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు సీషెల్స్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణ మార్పుల సవాళ్లపై పోరాడుతున్న దేశాలకు పురస్కారాన్ని అంకితం చేశారు. మన గ్రహాన్ని పచ్చనిదిగా, సుస్థిరమైనదిగా మార్చడానికి అవసరమైన ఏ చర్యలనైనా చేపట్టడానికి భారత్‌ సిద్ధంగా ఉందని మోదీ అన్నారు.

Social Share Spread Message

Latest News