
ఇండోనేసియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం దక్కింది. బిన్‌టాంగ్ ఆదిపూర్ణ అవార్డుతో ఇండోనేషియా ప్రభుత్వం మోదీని సత్కరించింది. ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఈ మెడల్‌ను ప్రధాని మోదీకి అందజేశారు. కాగా ఇరువురు నేత మీడియా సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, ఇండోనేసియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటు కానున్నదని తెలిపారు. మరోవైపు భారత్ ఇండోనేసియాతో కీలక ఒప్పందం చేసుకున్నది. ఇండోనేసియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని ఆ దేశానికి అమ్మేందుకు ఒప్పందంపై సంతకాలు చేశారు.





























