Skip to main content

Namaste NRI

టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానంకు భారీ షాక్

ఖైరతాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు ప్రజాప్రతినిధుల కోర్టు రూ.వెయ్యి జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష విధించింది. బంజారాహిల్స్‌లో 2013లో నమోదైన కేసులో దానంను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఓ వ్యక్తిపై దాడి చేసి గాయపరిచారనే అభియోగాలు రుజువు కావడంతో నాగేందర్‌కు జైలు శిక్ష విధించింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లేందుకు అనుమతించిన న్యాయస్థానం శిక్ష అమలును నెల రోజులు వాయిదా వేసింది.

Social Share Spread Message

Latest News