Skip to main content

Namaste NRI

నోబెల్ శాంతి బ‌హుమ‌తికి నేను అర్హుడిని

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి త‌న‌ నోబెల్ శాంతి బ‌హుమ‌తి ఆకాంక్షను బయటపెట్టుకున్నారు. తానేమీ గొప్పలు చెప్పుకోవ‌డం లేదని, ఎనిమిది యుద్ధాలు ఆపానని మ‌రోసారి పాత పాట అందుకున్నారు. ఒకవైపు ఇరాన్‌ తో యుద్ధం చేస్తూనే ఎనిమిది యుద్ధాలు ఆపానంటూ నోబెల్‌ శాంతి బహుమతి ప్రకటన వేళ హడావుడి షురూ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏ అమెరికా అధ్య‌క్షుడు చేయలేని పనులు తాను చేశాన‌ని, తాను గొప్పలు చెప్పడం లేదని, వాస్తవాలే మాట్లాడుతున్నాన‌ని ట్రంప్ అన్నారు.

గతంలో ఏ అధ్యక్షుడు కూడా ఇన్ని యుద్ధాలకు పరిష్కారం చూపించి ఉండకపోవచ్చ‌ని చెప్పారు. తాను ఇప్ప‌టికే 8 యుద్ధాలు ఆపానని, నోబెల్ శాంతి బహుమతి పొందేందుకు తాను అన్నివిధాల‌ అర్హుడినని అన్నారు. కానీ నోబెల్‌ నాకు వస్తుందనే నమ్మకం మాత్రం తక్కువేన‌ని చెప్పారు. నోబెల్‌ కమిటీని ఉద్దేశిస్తూ వారి నిర్ణయం ఏమిటో త‌న‌కు తెలియదని, నాలాంటి వారికి నోబెల్ శాంతి పురస్కారం ఇవ్వకపోవడమే వారికి అలవాటుగా ఉన్న‌ట్లు కనిపిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా ఏటా నార్వేజియన్ నోబెల్ కమిటీ నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events