చాలా పార్టీల నుంచి ఆఫర్లు వచ్చినా పోలేదు, నాకు పార్టీ మారే అవసరం లేదు అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భువనగిరిలో జరిగిన వైఎస్సార్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానేత విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తనకు పీసీసీ అధ్యక్ష పదవి రానుందుకు బాధగా ఉందని అన్నారు. అన్ని అర్హతలు ఉండి పదవి ఇవ్వకుంటే బాధగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు కొత్త గ్రూపులు కట్టే అవసరం లేదని అన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తే అందరం నష్టపోతామన్నారు. గాంధీ భవన్‌లో కూర్చుంటే ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రజలతో మమేకమై గ్రూప్‌లు లేకుండా పని చేస్తేనే గెలుస్తాం అని అన్నారు. కేసీఆర్‌ను ఓడిరచాలంటే అందరం కలిసికట్టుగా పని చేయాలి అని తెలిపారు. నాకు ఏ పదవి అవసరం లేదు. భువనగిరి ఎంపీగా రూపాయి ఖర్చు లేకుండా కాంగ్రెస్ కార్యకర్తలు నన్ను గెలిపించారు అని అన్నారు.