Skip to main content

Namaste NRI

ఆదర్శ కుటుంబం: వెంకటేశ్ కూతురిగా యువినా పార్థవి

వెంకటేష్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఆదర్శకుటుంబం హౌస్‌ నెం: 47. ఈ నేపథ్యంలో ఈ సినిమాలోని పాత్రల్ని పరిచయం చేస్తూ ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. ఇటీవలే చిట్టిబాబు పాత్రలో వెంకటేష్‌ను, స్వర్ణ పాత్రలో కథానాయిక శ్రీనిధిశెట్టిని పరిచయం చేసిన విషయం తెలిసిందే.

సంపూర్ణ పాత్రలో యువినా పార్థవిని ఇంట్రడ్యూస్‌ చేస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఇందులో చిట్టిబాబు, స్వర్ణ దంపతుల గారాల కూతురిగా సంపూర్ణ కనిపిస్తుందని.. అల్లరి, అమాయకత్వం, చిలిపితనం కలబోసిన ఆమె పాత్ర నవ్వుల్ని పండిస్తుందని, కుటుంబంలో అనుకోని సంఘటనలకు కూడా కారణమవుతుందని మేకర్స్‌ తెలిపారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్నది.

Social Share Spread Message

Latest News