రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బంగారు బోనం సమర్పిస్తానని, ఈ మేరకు తాను మొక్కుకున్నానని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. లాల్ దర్వాజా బోనాల సందర్భంగా పాతబస్తీలో ఉన్న అమ్మవారి ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. కరోనా తగ్గి, అందర్నీ కాపాడాలని తగ్గాలని మొక్కుకున్నట్లు ఆమె తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అందరూ కలిసి ముందుకు రావాలని, అప్పుడే ధర్మం నిలబడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో నియంత పాలన కొనసాగుతోందని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నియంత పాలన నుంచి తెలంగాణను విముక్తి చేయాలని కూడా అమ్మ వారిని కోరానని విజయశాంతి తెలిపారు.