తాను అమెరికా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైతే ఉక్రెయిన్ యుద్ధాన్ని అంతం చేస్తానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. నవంబరు ఎన్నికల్లో గెలిస్తే జనవరిలో అధికారం చేపట్టకముందే యుద్ధాన్ని ముగింపజేస్తానని,2022 లో తాను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధం జరిగేదే కాదని అన్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన ఆయన్ని అభినందించడానికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్ చేసినప్పుడు ఇరువురూ నేతలు ఈ అంశంపై చర్చించుకున్నారు. జెలెన్‌స్కీతో చాలాచక్కని సంభాషణ జరిగింది. కాబోయే అధ్యక్షునిగా ప్రపంచా నికి నేను శాంతిని తీసుకురాబోతున్నాను. లెక్కకుమిక్కిలి అమాయక ప్రజలను బలిగొన్న యుద్ధానికి నేను చర మగీతం పాడతాను. ఇరుపక్షాలు చర్చల ద్వారా ఒప్పందానికి వచ్చి హింసకు స్వస్తిపలికేలా చేస్తా అని ట్రంప్ పేర్కొన్నారు. తనపై హత్యాయత్నం జరగడాన్ని జెలెన్‌స్కీ ఖండిరచారని తెలిపారు.