Namaste NRI

ఆ బిల్లు పెడితే.. వెంటనే సంతకం చేస్తా: బైడెన్‌

అమెరికాలో రోజురోజుకు పెరుగుతున్న తుపాకుల సంస్కృతిపై ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయుధాలను నియంత్రించే శాసనాన్ని వెంటనే తేవాలని కాంగ్రెస్‌కు విజ్ఞప్తి చేశారు. టెక్సస్‌లోని అల్లెన్‌లో షాపింగ్‌ సెంటర్‌లో  జరిగిన దుండగుడి కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, ఏడుగురు గాయపడిన ఉదంతం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని బైడెన్‌ పేర్నొన్నారు. ప్రమాదకర ఆయుధాలపై నియంత్రణ తేవాలని, నిషేధం విధించాలని కాంగ్రెస్‌ను విజ్ఞప్తి చేశారు.

Social Share Spread Message

Latest News