హుజూరాబాద్ నియోజకవర్గానికి ప్రకటించిన విధాంగానే గోషామహల్ నియోజకవర్గానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. నియోజకవర్గానికి ప్యాకేజీ ప్రకటిస్తే తాను ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసేందుకు సిద్దమని సంచలన ప్రకటన చేశారు. ఎన్నికలు వస్తేనే సీఎం కేసీఆర్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు గుర్తు వస్తారన్నారు. హుజూరాబాద్‌లో ఓటమి తథమ్యని తెలుసుకున్న కేసీఆర్ గెలవడానికి ప్యాకేజీలను ప్రకటించారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం ద్వారా ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న డిమాండ్ పేరుగుతోందన్నారు. రాజీనామా చేస్తే ప్యాకేజీ వస్తుంది. సమస్యలు పరిష్కార మవుతాయి. వ్యక్తిగతంగా లాభం చేకూరుతుందన్న ఉద్దేశ్యంతో తన నియోజవర్గంలోని ప్రజలు తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారన్నారు.