Namaste NRI

ఈ బిల్లు చట్టంగా మారితే.. భారతీయులకు ప్రయోజనం

అమెరికాలో ఉద్యోగ వీసాలపై ఉండేవారికి ఇచ్చే గ్రీన్‌కార్డులపై దేశాలవారీగా ఉన్న పరిమితిని ఎత్తేసి, కుటుంబ వీసాలపై అక్కడ ఉండేవారికి ఇచ్చే గ్రీన్‌కార్డుల పరిమితిని 7 నుంచి 15 శాతానికి పెంచే బిల్లుకు యూఎస్‌ హౌస్‌ జ్యుడీషియరీ కమిటీ ఆమోదం లభించింది. ఈక్వల్‌ యాక్సెస్‌ టు గ్రీన్‌ కార్డ్స్‌ ఫర్‌ లీగల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఈగిల్‌)యాక్ట్‌ పేరిట రూపొందించిన ఈ ముసాయిదా బిల్లు ప్రతినిధుల సభలో చర్చకు, ఓటింగ్‌కు వెళ్లనుంది. ఆ తర్వాత సెనెట్‌లో కూడా ఆమోదం పొందాల్సి ఉంది. సెనెట్‌ కూడా పచ్చజెండా ఊపితే దానిపై అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశాక చట్టంగా మారుతుంది.

                ఈ బిల్లు చట్టంగా మారితే భారతీయులకు, చైనీయులకు ఎక్కువ ప్రయోజనం. ప్రపంచంలోనే అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చి శాశ్వతంగా స్థిరపడాలనుకునే వారికి సమానంగా అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో  దశాబ్దాల క్రితం గ్రీన్‌కార్డులపై దేశాలవారీగా 7 శాతం పరిమితిని విధించారు. ప్రస్తుతం అమెరికాలో ఈ రెండు దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు గ్రీన్‌కార్డుల కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. సమాన అర్హతలు కలిగినవారు, కొన్ని సందర్భాల్లో ఎక్కువ అర్హతలు ఉన్నవారు ఫలానా దేశంలో పుట్టారన్న కారణంతో గ్రీన్‌కార్డు పొందలేకపోతున్నారని, ఈ విధానాన్ని మార్చాల్సి ఉందని అమెరికా పార్లమెంట్‌ సభ్యురాలు జోయ్‌ లాఫ్‌గ్రెప్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events