ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీఆర్‌ఎస్ ఎన్నారై బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిల్లర రాజకీయాలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు బీజేపీ తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. కవిత ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేయడాన్ని నీచమైన చర్యగా పేర్కొన్నారు. కవితను ఎదుర్కొనే శక్తి లేక బీజేపీ నాయకులు ఆమెపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబం వెంటనే ఉన్నారని స్పష్టం చేశారు.














