Skip to main content

Namaste NRI

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కు అస్వస్థత

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌ అస్వస్థతకు గురుయ్యారు. ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరైన క్లింటన్‌ స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తన సిబ్బందికి చెప్పాడు. దీంతో  క్లింటన్‌ కాలిఫోర్నియాలోని ఇర్విన్‌ మెడికల్‌ సెంటర్‌ చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం క్లింటన్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. యూరిన్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్లే క్లింటన్‌ అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. వయసు పైబడిన వారిలో సాదారణంగా వచ్చే సమస్యే అని వైద్యులు స్పష్టం చేశారు.  డాక్టర్‌ అల్పేస్‌ అమీన్‌, డాక్టర్‌ లిసా బార్‌డాక్‌ నేతృత్వంలోని క్లింటన్‌కు చికిత్స కొనసాగుతోంది.

Social Share Spread Message

Latest News