Namaste NRI

కార్తికేయ 2 లో నన్ను నేను అడిగా…నాకెవ్వరు నువ్వని

నిఖిల్‌ హీరోగా చందు మొండేటీ తెరకెక్కించిన చిత్రం కార్తికేయ 2.  కార్తికేయ కు సీక్వెల్‌గా రూపొందింది. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని నన్ను నేను అడిగా.. నాకెవ్వరు నువ్వని అనే వీడియో గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు కాలభైరవ స్వరాలు సమకూర్చగా.. కృష్ణ మాదినేని సాహిత్య మందించారు. ఇన్నో గెంగా ఆలపించారు. శ్రీకృష్ణుడి చరిత్రను శోధిస్తూ డాక్టర్‌ కార్తికేయ చేసిన ప్రయాణంగా ఈ సినిమా సాగనుంది. ఇందులో ముగ్ధ పాత్రలో అనుపమ కనిపించనుంది. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  కళ: సాహి సురేష్‌, ఛాయాగ్రహణం: కార్తిక్‌ ఘట్టమనేని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events